క్షిపణుల రూపకర్త కన్నుమూత
రష్యా క్షిపణుల అత్యున్నత రూపకర్తల్లో ఒకరైన అలెగ్జాండర్ లియోనోవ్ (74) కన్నుమూశారు. రష్యాకు చెందిన హైపర్‌సోనిక్ క్షిపణి జిర్కాన్, ఇండో-రష్యన్ బ్రహ్మోస్ NG అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. NPO మాష్ కంపెనీ సీఈవో, చీఫ్ డిజైనర్‌గా ఆయన పనిచేశారు. ఈ సంస్థతో కలిసి ఢిల్లీ కేంద్రంగా ఉన్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ సరికొత్త తరం బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేసింది.