జిల్లాలో ఆహార నాణ్యతపై తనిఖీలు
MDK: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ అధికారులు కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. ముఖ్యంగా ఫతేనగర్‌లోని రేషన్ షాపును సందర్శించి బియ్యం నాణ్యతను, నిల్వలను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు.