జిల్లాలో నేడే జాబ్ మేళా
PDPL: జిల్లా కేంద్రంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి టాస్క్ రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి బస్టాండ్ సమీపంలోని టాస్క్ సెంటర్‌లో జరిగే ఈ మేళాలో ప్రముఖ కంపెనీలు డిప్లొమా, ఐటీఐ, ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులను ఎంపిక చేయనున్నాయన్నారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.