అంగన్వాడీల ధర్నాకు మద్దతు పలికిన ఎమ్మెల్సీ గోపి

అంగన్వాడీల ధర్నాకు మద్దతు పలికిన ఎమ్మెల్సీ గోపి

W.G: భీమవరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపి మూర్తి పాల్గొని మాట్లాడారు. అన్ని రకాల సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయని ఖర్చులు భారంగా మారాయని, వీటిని తట్టుకోవాలంటే వేతనాలు పెంచకుండా ఎన్ని మాటలు చెప్పినా పొట్ట నిండదన్నారు. అంగన్వాడీల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.