తిరుపతిలో విద్యార్థినిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం

తిరుపతిలో విద్యార్థినిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం

తిరుపతిలో ఓ కళాశాల విద్యార్థిని (మైనర్ బాలిక)పై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. హాస్టల్ మారే క్రమంలో పరిచయమైన డ్రైవర్ డబ్బు సాయం చేస్తానని నమ్మబలికి బాలికను గదికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించగా, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.