నేటి తిరుమల సమాచారం (సోమవారం)
TPT: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం ఒక్కరోజే మొత్తం 83,271 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 25,018 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ద్వారా రూ.3.78 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.