వడదెబ్బతో మహిళ మృతి

NGKL: కొల్లాపూర్ మండలం ముక్కిడి గుండం గ్రామానికి చెందిన గిరిజన మహిళ లక్ష్మి వడదెబ్బతో సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. లక్ష్మీ భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందగా ఆమె రేకుల గుడిసెలో ఒంటరిగా జీవనం సాగిస్తుంది. వడదెబ్బకు గురైన ఆమె సోమవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.