వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఐసీడీఎస్ అధికారి
ADB: తలమడుగు మండలంలోని శ్రీ సాయిలింగి ట్రస్ట్ సౌజన్యం ఆధ్వర్యంలో శనివారం వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఐసీడీఎస్ అధికారి రాజేంద్రప్రసాద్ 35 మంది దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు అశోక్, ఫస్ట్ మేనేజర్ రాజు, దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, వికలాంగుల సభ్యులు, తదితరులు ఉన్నారు.