మృతుడికి నివాళి.. కుటుంబానికి పరామర్శ
NLG: డిండి మండలంలోని జాల్ తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ధర్మనాయక్ తండ్రి రాత్లావత్ చంద్రు నాయక్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నేడు వారి స్వగృహానికి వెళ్లి చంద్రు నాయక్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు ఉన్నారు.