గుంతల వద్ద బీఆర్ఎస్, బీజేపీ ఆందోళన

BDK: బూర్గంపాడు మండలం మేజర్ గ్రామపంచాయతీ సారపాకలోని అంతర్గత రహదారుల దుస్థితిపై BJP, BRS ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. సారపాకలోని మసీద్ రోడ్‌లోని గుంతల వద్ద నాయకులు ఆందోళన చేపట్టారు. అంతర్గత రహదారులు అధ్వానంగా తయారయ్యాయని, సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు ఏనుగుల వెంకటరెడ్డి, బెజ్జంకి కనకాచారి ఉన్నారు.