విద్యార్థినుల్లో భద్రతపై అవగాహన కార్యక్రమం

విద్యార్థినుల్లో భద్రతపై అవగాహన కార్యక్రమం

CTR: చిత్తూరు పట్టణంలోని కస్తూరిబా మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హైస్కూల్‌లో శక్తి టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై నేరాలు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై ఎస్సై కరిమునిస్సా అవగాహన కల్పించారు. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు, శక్తి యాప్ వినియోగం, స్వీయరక్షణ పద్ధతులపై సూచనలు ఇచ్చారు.