విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం
BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు పలు పాఠశాలలు, కళాశాలల్లో పలు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పోక్సో చట్టం, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, మంచి నడవడికలో ఉన్నత శిఖరాలకు చేరుకుని స్ఫూర్తిదాయకంగా నిలవాలని సూచించారు.