రాష్ట్ర పరిస్థితులపై వైసీపీ ఆందోళన
బాపట్ల జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.