రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత
AP: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. అల్లూరి, అన్నమయ్య, మన్యం, శ్రీకాకుళం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు, అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలలోపు నమోదవుతున్నాయి. దీంతో రాత్రి, తెల్లవారుజామున ప్రజలు చలితో వణికిపోతున్నారు. బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.