జేసీ అగ్రహారంలో లోపించిన పారిశుధ్యం

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని జేసీ అగ్రహారంలో గల YSR కాలనీలో పారిశుధ్యం లోపించింది. కాలనీ మొత్తం మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతుండడంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై మురుగునీరు చేరి, దోమల బెడద ఎక్కువగా ఉందని కాలనీవాసులు తెలిపారు. అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.