జిల్లాలో 16 నుంచి "రైతన్న మీకోసం" కార్యక్రమం: కలెక్టర్
కడప: రైతుల సమస్యల పరిష్కారం, వ్యవసాయాభివృద్ధే లక్ష్యంగా ఈ నెల 16 నుండి 25 వరకు జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో "రైతన్న మీకోసం" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఖరీఫ్ సాగు, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.