'ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి'

ప్రకాశం: ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని నేపథ్యంలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు రణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ నాయకులు సోమవారం వెల్లడించారు. రాచర్ల మండలంలో చలో విజయవాడ రణభేరి కార్యక్రమం యొక్క గోడపత్రికను యూటీఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. ఈనెల 25న విజయవాడలో భారీ రణబెరి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.