'రాణా స్థానంలో వచ్చాడు.. 'MOM' గెలిచాడు'
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో అర్ష్‌దీప్ సింగ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. కానీ, ఈ మ్యాచ్‌లో హర్షీత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు 4 ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ఈ అవార్డు దక్కించుకున్నాడు.