కాకినాడలో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి

సినీ నటి అనుపమా పరమేశ్వరన్ సోమవారం కాకినాడలో సందడి చేశారు. సుబ్బయ్య హోటల్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హోటల్లో భోజనం ఎంతో రుచిగా ఉందని తెలిపారు. త్వరలో తన సినిమా 'పరదా' విడుదల కానుందని చెప్పారు. ఈ క్రమంలో ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు.