VIDEO: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన సిబ్బంది
NRML: లక్ష్మణచందా మండలంలోని 18 గ్రామాల్లో గురువారం జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిబ్బంది సిద్ధమయ్యారు. బుధవారం మండల కార్యాలయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందించారు. పోలింగ్ సామాగ్రి స్వీకరించిన ఎన్నికల అధికారులు ఆయా పోలింగ్ కేంద్రాలకు వాహనాల్లో తరలి వెళ్లారు.