VIDEO: విఘ్నేశ్వరుని ఆలయంలో భారీగా అక్షరాభ్యాసాలు
కోనసీమ: అయినవిల్లి సిద్ది వినాయక స్వామి సన్నిధిలో ఆదివారం సామూహిక అక్షరాభ్యాసాలు, అన్న ప్రాసలు భారీగా జరిగాయి. పాల్గుణ మాసం బహుళ పంచమి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తమ చిన్నారులచే అక్షరాభ్యాసాలు చేయించారు. అనంతరం భక్తుల స్వామివారిని దర్శించుకుని, ఆశీర్వచనాలు అందుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం చిన్నారులతో సందడిగా మారింది.