ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థుల డ్యాన్స్

ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థుల డ్యాన్స్

పారిశ్రామిక వేత్త, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ కుమార్తె వివాహ వేడుకలో మహిళా ఎంపీలు డ్యాన్స్ చేశారు. బయట ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ఎంపీలంతా ఒకే వేదికపై స్టెప్పులేశారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, NCP(SP) ఎంపీ సుప్రియా సులే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కలిసి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇందుకోసం వారు ముందుగా కలిసి ప్రాక్టీస్ కూడా చేయడం గమనార్హం.