VIDEO: జనగామలో ‘ఈట్ రైట్ వాక్’ భారీ ర్యాలీ
JN: జనగామ జిల్లా కేంద్రంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘ఈట్ రైట్ వాక్’ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. నెహ్రూ పార్క్ నుంచి సెయింట్ మేరీస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు.