పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత డయాబెటిక్ పరీక్షలు

పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత డయాబెటిక్ పరీక్షలు

Jgl: మెట్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో124 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత డయాబెటిక్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నెల రోజులుగా వివిధ గ్రామాల్లో, పట్టణంలోని పలు సెంటర్లలో డయాబెటిక్ పరీక్షలు చేస్తున్నామని, ఈ నెల 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.