'రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం'

'రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం'

NLR: రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డీఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖలో అవసరమైన మార్పులు తీసుకుని వచ్చి రైతులు అన్ని రకాలుగా సహకరించడం జరుగుతుందన్నారు. చివరి ఆయకట్టుకు కూడా నీరు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.