ఉచిత వైద్య శిబిరం.. 250 మందికి పరీక్షలు
RR: బుద్వేల్ సబ్‌సెంటర్‌లో "99 రోజుల ప్రజా పాలన కార్యక్రమం"లో భాగంగా శుక్రవారం ఉచిత ఎన్‌సీడీ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 250 మందికి పైగా స్థానికులకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేసి వైద్య సేవలు అందించారు. డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో, డాక్టర్ ఖాజీ మిస్బా అహ్మద్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు.