కావేరీ బస్సు ప్రమాదం.. యాదాద్రికి చెందిన యువతి మృతి
BNR: యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరు గ్రామంలో విషాదం నెలకొంది. కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో గ్రామానికి చెందిన అనూషరెడ్డి దుర్మరణం పాలయ్యారు. బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అనూష దీపావళికి సొంతూరుకు వచ్చింది. బెంగళూరు వెళ్లేందుకు రాత్రి ఖైరతాబాద్‌లో బస్సు ఎక్కి ప్రమాదంలో సజీవదహనం అయ్యింది.