యాపిల్ సంస్థలో లేఆఫ్‌లు
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ తమ ఉద్యోగులకు లేఆఫ్‌లను ప్రకటించింది. తమ గ్లోబల్ సేల్స్ ఆపరేషన్స్‌లో పని చేసే డజన్ల మంది ఉద్యోగులను తొలగించినట్లు బ్లూమ్ బర్గ్ తెలిపింది. వీరిలో కార్పొరేట్ సంస్థలు, స్కూళ్లు, ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి పని చేసే సేల్స్ టీమ్స్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా వచ్చే ఏడాది జనవరి 20లోగా మరో ఉద్యోగం చూసుకోవాల్సి ఉంటుంది.