అభివృద్ధిని చూసి ఓటు వేయాలి: ప్రభుత్వ సలహాదారు

అభివృద్ధిని చూసి ఓటు వేయాలి: ప్రభుత్వ సలహాదారు

NZB: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.