ఐఐటీ హాస్టల్ వద్ద 11 అడుగుల కొండచిలువలు

ఐఐటీ హాస్టల్ వద్ద 11 అడుగుల కొండచిలువలు

ముంబైలోని ఐఐటీ బాంబేలోని హాస్టల్ వద్ద కొండచిలువలు కలకలం రేపాయి. పవాయిలోని H14 బాయ్స్ హాస్టల్ బయట 11 అడుగుల పొడవున్న రెండు ఆజగర్లు కనిపించడంతో విద్యార్థులు భయపడ్డారు. వీటిలో ఒకటి 19 కిలోలు, మరొకటి 17 కిలోలు ఉన్నాయి. సమాచారం అందుకున్న PAWS బృందం వాటిని సురక్షితంగా రెస్క్యూ చేసింది. వైద్య పరీక్షల అనంతరం వాటిని అడవిలో వదిలేశారు.