అమ్మనబోలులో ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

యాదాద్రి: మూటకొండూర్ మండలంలోని అమ్మనబోలు గ్రామంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, యువత, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధన కోసం పాటుపడాలని సూచించారు.