12న గూడూరులో విజయోత్సవ ర్యాలీ

TPT: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 12న గూడూరులో విజయోత్సవ ర్యాలీ జరగనుంది. సంగం థియేటర్ సమీపంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.