భద్రాద్రి ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
BDK: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. భద్రాద్రి పుణ్యక్షేత్రంలో రేపటి నుంచి జరిగే శ్రీరామనవమి ఉత్సవ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 2 వేల మంది పోలీసులతో ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బందోబస్తు చేసామన్నారు.