భక్తులతో కిటకిటలాడిన కాల్వ నరసింహస్వామి ఆలయం

NRML: శ్రావణమాసం చివరి శనివారం అమావాస్య సందర్భంగా కాల్వ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గోవింద నామాలతో ఆలయం మార్మోగింది. భక్తుల సౌకర్యార్థం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసి, అన్నప్రసాద వితరణను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి ముక్కులు తీర్చుకున్నారు.