విశాఖ ఉత్సవ్ ముగింపుపై కలెక్టర్ సమీక్ష
విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకలను దిగ్విజయంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ముగింపు రోజు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశమున్నందున భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. శనివారం తన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.