VIDEO: బైక్ బోల్తా.. వ్యక్తి మృతి
MDK: రామాయంపేట 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ బాలరాజు విచారణ చేపట్టారు.