మహిళల రక్షణ కొరకే షీ టీములు: సీఐ

కరీంనగర్: మహిళల రక్షణ కొరకే షీ టీములు పనిచేస్తున్నాయని కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలత అన్నారు. బీసీ స్టడీ సర్కిల్ లోని అభ్యర్థులకు సోమవారం షీ టీం బృందం ఆధ్వర్యంలో మహిళల చట్టాలు, మహిళల రక్షణ, సైబర్ నేరాలు, డైల్ 100 తదితర విషయాలపై అవగాహన కల్పించారు. మహిళలను ఎవరైనా ఇబ్బంది పెడితే షీ టీంకు ఫిర్యాదు చేయాలని సూచించారు.