'నారాయణ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు'
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గూడెల్లి (సుతారి) నారాయణ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి నారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం కల్పించారు. నారాయణ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.