హిందూపురం జాబ్ మేళాపై మంత్రి ప్రశంసలు
సత్యసాయి: హిందూపురం నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహించిన మెగా జాబ్ మేళాపై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణ దిశానిర్దేశంలో 110 ప్రఖ్యాత కంపెనీలు పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ మేళాలో 1,903 మంది ఉద్యోగాలకు ఎంపికవ్వగా, మరో 868 మంది తదుపరి ఇంటర్వ్యూలకు అర్హత సాధించారన్నారు.