'ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నా'
HYD: ఘట్‌కేసర్ అన్నోజిగూడలోని RVK విద్యాలయంలో ఇవాళ TPUS రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో MLC మల్క కొమరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLC మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా ఉపాధ్యాయుల సమస్యలపై TPUS ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు ఇంకా అలానే ఉన్నాయని, ఈ పరిస్థితి మారడం కోసం మండలిలో, బయట కృషి చేస్తున్నానని తెలిపారు.