'ప్లాస్టిక్ విక్రయిస్తే చర్యలు తప్పవు'

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని పలు కిరాణా దుకాణాలను సోమవారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ విక్రయిస్తున్న ఎనిమిది దుకాణాల నిర్వాహకులకు రూ.13,500 జరిమానా విధించారు. ప్లాస్టిక్ విక్రయించిన, నిలువ ఉంచిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ ప్రజలకు హెచ్చరించారు.