పుంగనూరులో న్యూమోనియా వ్యాధి పై అవగాహన
CTR: పుంగనూరు రూరల్ భీమాగానిపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్‌లో బుధవారం PHC డాక్టర్ పవన్ కుమార్ న్యుమోనియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. న్యుమోనియా ప్రాణాంతకమని, దగ్గు, జ్వరం, చలి, శ్వాస ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. అనంతరం ప్రభుత్వం ఉచిత టీకాలు అందిస్తున్నట్లు తెలిపారు.