'పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలి'
బాపట్ల డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి విజయలక్ష్మి సోమవారం పర్చూరులో పర్యటించారు. పెండింగ్‌లో ఉన్న పన్నులు, ఇతర బకాయిలను త్వరగా వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు. స్థానిక అధికారులతో కలిసి వ్యాపార సముదాయాలను సందర్శించి పన్నులు వసూలు చేశారు. ప్రజలు సమయానికి పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆమె సూచించారు.