రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు

రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు

NGKL: ఊర్కొండ మండలంలోని పలు గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి MGNREGS కింద రూ.80.5 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ సంతోష్ ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల సమస్యకు ఈ నిధులతో పరిష్కారం లభించనుంది. నిధుల మంజూరుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యేకు మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.