భారత ఆర్మీకి పూర్తి సహకారం అందిస్తాం: క్రేడా అధ్యక్షుడు

KMR: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 28 మంది పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదులను, వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని తగిన బుద్ధి చెప్పేందుకు ప్రధానికి, ఆర్మీకి తమ పూర్తి సహకారం ఉంటుందని క్రేడా సంఘ అధ్యక్షుడు లక్ష్మి నర్సాగౌడ్ చెప్పారు. ఉగ్రదాడిలో అమరులైన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శనివారం రాత్రి జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలి నిర్వహించారు.