రోడ్డును బాగుచేయరూ..?
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం పెదఖర్జ నుంచి సప్పగూడ కూడలి వరకు రాళ్లు తేలిన రహదారితో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే నరకయాతన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. కల్వర్టు శిథి లావస్థకు చేరుకుని, గొయ్యి ఏర్పడడంతో తుప్పలు ఏపుగా పెరిగాయి.