హంద్రీనీవా పంట కాలువకు గండి

KRNL: దేవనకొండ మండలం తువ్వదొడ్డి సమీపంలో హంద్రీనీవా పంట కాలువకు గండి పడింది. వాగు పరిసరంలో గండి పడటంతో నీరు వాగులోకి ప్రవహించింది. సమీపంలో పంట పొలాలు లేకపోవడంతో నష్టం జరగలేదు. రైతుల సమాచారం మేరకు ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించారు. ఇంజినీర్ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో జేసీబీలతో గండిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.