నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
E.G: దేవిచౌక్ సబ్ స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల నిమిత్తం శనివారం పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ నక్కపల్లి శ్యామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భాస్కర్ నగర్, దుర్గానగర్, సుబ్రహ్మణ్యనగర్, సీటీఆర్ ఐరోడ్డు, ఆర్అండ్‌బీ అతిథిగృహం, అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాల ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.