పవర్ ప్లేలోనే బుమ్రాతో అటాక్ చేయండి: గవాస్కర్
వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రెండు జట్లు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు. ముఖ్యంగా, బుమ్రా చేత పవర్ ప్లేలోనే బౌలింగ్ చేయించాలని సూచించాడు. బట్లర్, సాల్ట్, బ్రూక్ వంటి కీలక వికెట్లను త్వరగా తీయగలిగితే ఇంగ్లండ్ పని ముగిసినట్లేనని వ్యాఖ్యానించాడు.