ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి విస్తృత ప్రచారం
KNR: జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్ పేట్‌లో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల గురించి వివరించారు.